ఓపికతో ఉంటే చాలు..
ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు..
కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు.
కానీ అదే ఒక్క క్షణం
ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది.
ప్రతిరోజూ ఒక్కసారైనా
మీతో మీరు మాట్లాడుకోండి.
లేదంటే మీరు ఒక అద్భుతమైన
వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి.
అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి..
విజయం మీ వెంటే ఉంటుంది.
ప్రజల్లో మేల్కొలుపు..
మహిళా సాధికారత,
ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి.
అప్పుడే మీ ప్రాంతానికి మరియు
మన భారతదేశానికి అంతా మంచి జరుగుతుంది.
ఎవరికి వారు క్రైస్తవుడు హిందువు, బుద్ధిస్ట్ కాలేడు.
అలాగే హిందువు, బుద్ధిస్ట్ కూడా క్రైస్తవుడు కాలేడు.
కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి.
ఎవరికి వారు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.
0 Comments