Telugu friendship quotes
స్నేహానికి ఒక గ్రూప్ అంటూ ఉంటే..
అది మన ఫ్రెండ్స్ గ్రూప్ అని గర్వంగా చెప్పగలను.
చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి,
చిరు మాట చాలు స్నేహం చిగురించటానికి,
ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి.
కాలేజీలో మన ఫ్రెండ్స్
గ్రూప్‌కి ఉన్న ఫాలోయింగ్..
నేను ఎప్పటికి మర్చిపోలేను.
జీవితం అనే పుస్తకంలో
స్నేహం అనే కాగితంలో
మరువలేనిదే మీ స్నేహం!
నాకు ఏదైనా సమస్య వచ్చిందని తెలియగానే..
నా ముందుకి పరిష్కారంతో
సహా వచ్చేసేవాడివి నువ్వొక్కడివే.
జీవితంలో లక్షలు
సంపాదించినా లభించని సంతోషం,
మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.
జీవితంలో నాకు మన స్నేహం ఇచ్చినంతగా కిక్కు..
మరే ఇతర విషయం కూడా ఇవ్వలేకపోయింది.
చెమరించిన నయనాల్లో చెదిరిపోని జ్ఞాపకం స్నేహం
ఒడిదుడుకులలో ఓదార్పునిచ్చి
ఒడ్డున చేర్చే అభయహస్తం స్నేహం
ప్రతిఫలం ఆశించకుండా తోడై నిలిచేది స్నేహం
హృదయాన్ని స్విచ్ఆఫ్ చేయకుండా ఉంచితే
జీవితాంతం పనిచేసే అద్భుత నెట్‌వర్క్ స్నేహం!
నా జీవితంలో ఏమాత్రం
కూడా కష్టపడకుండా దొరికింది..
నీ స్నేహం మాత్రమే.
నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి,
అయినా నిన్ను ఇష్టపడే
వ్యక్తి, నీ స్నేహితుడు ఒక్కడే.
నేను బాధలో ఉన్నప్పుడు..
నీ ఓదార్పు నాకు ఎంతో
మనశ్శాంతినిని ఇచ్చింది
జగతిలో స్నేహానికి అడ్డులేదు..
ఏది అడ్డు కాదు కూడా.
స్నేహం అనే క్రికెట్‌లో
మనల్నిద్దరిని అవుట్ చేసేవారే లేరు.
రోజులు మారినా, మనుషులు మారినా,
శరీరాలు మారినా, మారిపోని వాడు ఒక్క
స్నేహితుడు మాత్రమే.
మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా,
నిస్సంకోచంగా, నమ్మకంగా
పంచుకోగలమో వారే స్నేహితులు
స్నేహం చిన్న విషయం కాదు..
ఎంత పెద్ద సమస్యనైనా
చిన్నదిగా మార్చే సాధనం
ద్వేషించడానికి క్షణ కాలం సరిపోతుందేమో!
అదే స్నేహానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది.
మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం,
అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం.
మన స్నేహం గొప్పతనాన్ని
వర్ణించడానికి నావద్ద మాటలు లేవు.
కేవలం నీ పైన ఉన్న స్నేహం తప్ప .
ఆపదలో అవసరాన్ని..
బాధలో మనసుని తెలుసుకుని
సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు
జీవితంలో మనం ఓడిపోయినప్పుడు..
మన వెన్నుతట్టే వారిలో ఒక
స్నేహితుడు/స్నేహితురాలు కచ్చితంగా ఉంటారు.
మనకు ఎన్ని బంధాలు,
బంధుత్వాలు ఉన్నా మన బాధలను,
సంతోషాలను, పూర్తిగా అర్థం చేసుకునే
స్నేహితుడితో పంచుకోవటంలో ఉన్న ఆనందమే వేరు.
మన స్నేహంలో మొదటి అంకం నేనైతే..
చివరి అంకం నువ్వు
ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టలేనిది,
కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది
స్నేహం మరువరానిది
ఎదుటివారు చూసి మరీ
ఈర్ష్యపడేంత గొప్పది మన స్నేహం
నిజమైన స్నేహితుడు నక్షత్రంలాంటి వాడు,
మాయమైనట్టు కనిపించినా ఎప్పుడూ అక్కడే ఉంటాడు.
గెలుపోటములకు అతీతమైన బంధం – స్నేహం.
స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పులేదు..
కాని మోసం చేయడానికి స్నేహం చేయకూడదు.
తాను ఓడిపోయినా సరే..
తన నేస్తం గెలవాలని కోరుకునే
స్వచ్ఛమైన బంధమే స్నేహం.
నీ మనస్సులోని మాటలను వినగలిగి,
నీవు చెప్పలేని మాటలను
చెప్పగలిగేవాడే నీ స్నేహితుడు.
ప్రతి బంధానికి ఆఖరి రోజు ఉంటుంది
ఒక్క మన స్నేహానికి తప్ప.
నిజాయితీ & నమ్మకం లేని
స్నేహం ఎక్కువ కాలం నిలబడదు.
దోస్త్ మేరా దోస్త్” అనే పాట..
మన ఇద్దరికోసమే రాసుంటారని
నేను అనుకోని రోజంటూ ఉండదు.
స్నేహం చేయటానికి పది సార్లు ఆలోచిస్తే,
దాన్ని వదులుకోవడానికి వంద సార్లు ఆలోచించు.
కన్నీళ్లు తెప్పించేవాడు కాదు..
కష్టాల్లో తోడుండేవాడు స్నేహితుడు
నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది ‘ప్రేమ’..
నేను లేకపోయినా నువ్వు ఉండాలని కోరుకునేది ‘స్నేహం’.
స్నేహ కోట్స్
తాను కష్టాల్లో ఉన్నా..
తన వారి కష్టాలని తీర్చేందుకు
ప్రయత్నించేవాడు స్నేహితుడు
జీవితం మనకు ఇచ్చే గొప్ప బహుమతి స్నేహం,
ఆ స్నేహాన్ని నేను అందుకున్నాను.
మన అభిమతానికి అనుగుణంగా
నడిచేవాడు స్నేహితుడు
స్నేహమంటే మాటలతో పుట్టి
చూపులతో మొదలయ్యేది కాదు
స్నేహమంటే మనసులో
పుట్టి మట్టిలో కలిసిపోయేది..
అద్దం మనకు నిజమైన నేస్తం..
ఎన్నటికీ అబద్దం చెప్పదు.
0 Comments