మన శక్తి కన్నా
సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది..
శుభోదయం..
అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని
ఎవరి గురించీ బాధపడకు.
వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే
వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు..
శుభోదయం..
తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది.
అలాగే సమస్యతో పాటు
పరిష్కారమూ కచ్చితంగా ఉంటుంది.
దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం..
గుడ్ మార్నింగ్..
మొదటి అడుగు వేసే ముందు
ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు..
కానీ ఒక్కసారి ముందడుగు వేశాక
వందమంది వెనక్కిలాగినా వెనుతిరిగి చూడకు..
శుభోదయం..
నీ ఆశయసాధనలో
ఎన్నిసార్లు విఫలమైనా సరే..
మరోసారి ప్రయత్నించడం మానద్దు..
గుడ్ మార్నింగ్..
గెలుపు కోసం పరుగులు పెట్టకు..
విలువలతో కూడిన బంధాలను కొనసాగిస్తూ
తెలివితేటలు సంపాదించుకో..
అదే నీకు విజయం సాధించి పెడుతుంది..
శుభోదయం..
విజయమే సర్వస్వం కాదు..
పరాజయమే అంతం కాదు..
ఏం జరిగినా
మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం..
శుభోదయం..
చేసే పని చిన్నదైనా..
సవ్యంగా చేస్తే..
అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది..
గుడ్ మార్నింగ్
గెలిచినప్పుడు పొంగిపోకుండా..
ఓడినప్పుడు కుంగిపోకుండా
ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది..
శుభోదయం
సమస్య ఎదురైనప్పుడు
అద్దం ముందు నిలబడితే..
ఆ సమస్యను పరిష్కరించే
గొప్ప వ్యక్తిని అద్దం మనకు చూపిస్తుంది..
శుభోదయం
సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా..
బిందెడు మంచి నీళ్లకే విలువ ఎక్కువగా ఉంటుంది.
అలాగే నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నా..
నీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువగా ఉంటుంది..
గుడ్ మార్నింగ్
0 Comments