మన ఆట పాటల్లోనే కాదు,
మన జీవితంలోని
ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు.
ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని సాగించే
బంధమే స్నేహ బంధం.
స్నేహమంటే
మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు,
మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పటం.
కులమత బేధం చూడనిది,
పేద, ధనిక బేధం లేనిది,
బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
గాయపడిన మనసుని సరిచేసేందుకు,
స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి,
కలవలేక పోయినా
నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి
ఒక్క నీ స్నేహితుడు మాత్రమే.
విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ,
గడిస్తే తెలుస్తుంది కాలం విలువ,
స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది,
స్నేహితుడి విలువ.
నువ్వు నలుగురిలో ఉన్నా
నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ,
నీలో నువ్వు లేకున్నా
మేం నలుగురం నీకున్నాం అని చెప్పేది స్నేహం.
నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా
నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు,
కానీ మోసం చేయటానికి
స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు.
చిన్న విషయం కాదు స్నేహం,
ఎంతటి సమస్యనైనా
చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం.
సూర్యుడు ఉదయించటం మరచినా,
సముద్రం అలలను మరిచినా,
సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం.
నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు,
నీ కష్టాలను కుడా పంచుకునే వాడు
నిజమైన స్నేహితుడు.
మౌనం వెనుక మాటను,
కోపం వెనుక ప్రేమను,
నవ్వు వెనక బాధను
అర్థం చేసుకునే వాడే స్నేహితుడు.
ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా,
నిర్భయంగా పంచుకోగలిగేది
ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే.
షరతులు లేకుండా నీతో ఉండేవాడు,
ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేవాడు,
నీ స్నేహితుడు.
ఎంత మంది బంధువులున్నా,
అన్ని భావాలను పంచుకోగలిగేది
ఒక్క స్నేహితుడితో మాత్రమే.
తన మిత్రుడు
ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళేవాడు,
దుఃఖంలో ఉన్నపుడు పిలవకపోయినా
వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు.
నువ్వులేకుంటే
నేను లేనని అనేది ప్రేమ అయితే,
నువ్వుండాలి,
నీతో పాటు నేనుండాలి
అని ధైర్యాన్నిచ్చేది స్నేహం.
నీమీద నీకే నమ్మకం లేని సమయంలో
కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.
0 Comments